Hebah Patel | ‘ ‘ఓదెల రైల్వే స్టేషన్’ లాక్డౌన్ టైమ్‌లో ధైర్యం చేసి తీసిన ఓటీటీ సినిమా. అది ఊహించని విజయాన్ని సాధించింది. సినిమా చేసేటప్పుడుకానీ. స్ట్రీమింగ్ అయి ప్రేక్షకాదరణ పొందుతున్నప్పుడుకానీ.. భవిష్యత్తులో దీనికి ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని మేం ఎవ్వరం అనుకోలేదు. ఓ విధంగా ఇది మాఅందరికీ ఊహించని అదృష్టం.’ అని హెబ్బాపటేల్ అన్నారు. నాగ సాధువుగా మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో తమన్నా నటించిన చిత్రం ‘ఓదెల 2’.
ఓటీటీ హిట్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్.సింహా ముఖ్య పాత్రధారులు. దర్శకుడు సంపత్ నంది సూపర్విజన్లో అశోక్ తేజ దర్శకత్వంలో డి.మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హెబ్బాపటేల్ విలేకరులతో ముచ్చటించారు.
‘ ‘ఓదెల రైల్వే స్టేషన్’కీ ఈ సినిమాకు అస్సలు సంబంధం లేదు. ఫస్ట్‌పార్ట్ అవుట్ అండ్ అవుట్ మర్డర్ మిస్టరీ. ఇదేమో సూపర్ నాచురల్ థ్రిల్లర్. ‘ఓదెల’కంటే ఇది మచ్ బిగ్గర్. ఆడియన్స్‌కి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అద్భుతమైన ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఇందులో నా సిస్టర్ క్యారెక్టర్లో కనిపిస్తారు తమన్నా. మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయి.
ఫస్ట్‌పార్ట్‌లో నా పాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో.. ఈ సెకండ్ పార్ట్‌లో కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. నటిగా నా స్థాయిని, నాపై నాకు నమ్మకాన్ని పెంచిన పాత్ర ఇది. సంపత్‌నంది నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా. నటిగా తమన్నా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అశోక్‌తేజ క్లారిటీ ఉన్న దర్శకుడు. ఆయనతో పనిచేయడం ఓ మంచి ఎక్స్పీరియన్స్.’ అంటూ చెప్పుకొచ్చారు హెబ్బా పటేల్.