Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Ram Gopal Varma | ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
అమరావతి : ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈనెల 27కు ఏపీ హైకోర్టు(AP High Court) విచారణను వాయిదా వేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై ఫొటోలు మార్ఫింగ్ (Photos Marfing) చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో రాంగోపాల్ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు(Cases) నమోదయ్యాయి.
ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసులో పోలీసులు రెండు సార్లు నోటీసులు అందించినా వర్మ విచారణకు హాజరుకాలేదు. దీంతో వర్మ కోసం పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టులో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఆర్జీవీ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగగా విచారణ రేపటికి వాయిదా పడింది.
ఈ నెల 23న కోయంబత్తూరులో షూటింగ్లో పాల్గొన్నట్టు తెలియజేస్తూ.. యాక్టర్లతో దిగిన ఫొటోలను ఎక్స్‌లో ట్వీట్ చేశాడు వర్మ. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే వర్చువల్‌గా విచారణకు హాజరవుతారని వర్మ లీగల్ టీం పోలీసులకు తెలియజేసిన విషయం తెలిసిందే.
ఒంగోలు పోలీసులు మొదట హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి కూడా వెళ్లారు. అయితే వర్మ అక్కడ లేకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారని తెలిసిందే. వర్మ ఫోన్ స్విచాఫ్ వస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

