Hathya | దివంగత నాయకుడు, మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద రెడ్డి(Y.S Viveka Nanda reddy) మర్డర్‌కి సంబంధించి ఓ చిత్రం రాబోతుంది. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి (Viveka biopic) జీవిత కథ ఆధారంగా వివేకం అనే వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హత్యకు సంబంధించి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. హత్య అంటూ రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. వైఎస్ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కాగా ఈ సినిమాను జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
శ్రీవిద్య బసవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ధన్య బాలకృష్ణ రవి వర్మ, పూజా రామచంద్రన్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్, రఘునాథ్ రాజు, శివాజీ రాజా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.