Nandamuri Fans | నందమూరి అభిమానుల మధ్య గొడవలు ఇంకా చల్లారలేదా..?
Nandamuri Fans | ఒక కుటుంబ హీరోల ఫ్యాన్స్, మరో కుటుంబ హీరోల అభిమానులతో గొడవపడితే ఏదైనా అర్థం ఉంటుంది.. కానీ వాళ్లలో వాళ్ళ గొడవపడితే ఎలా ఉంటుంది చెప్పండి.
Nandamuri Fans | ఒక కుటుంబ హీరోల ఫ్యాన్స్, మరో కుటుంబ హీరోల అభిమానులతో గొడవపడితే ఏదైనా అర్థం ఉంటుంది.. కానీ వాళ్లలో వాళ్ళ గొడవపడితే ఎలా ఉంటుంది చెప్పండి. అప్పట్లో మెగా ఫాన్స్ మధ్య ఇలాంటి గొడవలే వచ్చాయి. అల్లు అర్జున్, చిరంజీవి వర్గాల మధ్య ఏదో గొడవ నడుస్తుందని.. అల్లు వారబ్బాయి సొంతంగా ఎదిగాను అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అప్పట్లో చర్చ బాగానే జరిగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని చెప్పడం కూడా అప్పట్లో సంచలనం అయింది. అయితే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మేమంతా ఒక్కటే అని మెగా హీరోలు చెప్తూనే ఉంటారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు నందమూరి అభిమానుల మధ్య కూడా ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల మధ్య ఎప్పటినుంచో ఆ గ్యాప్ కనిపిస్తూనే ఉంది. వాళ్ల కొత్త సినిమాలు విడుదలైనప్పుడు అది స్పష్టంగా బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా బాలయ్య సినిమా విడుదల నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగవంత్ కేసరి సినిమాను చూడొద్దు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సెన్సేషన్ అవుతుంది. అలాగే బాలయ్య అభిమానులు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదే రేంజ్ కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా ఏపీలోని ఒక థియేటర్ దగ్గర బాలయ్య బ్యానర్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉందని అభిమానులు కోపంతో ఊగిపోయారు. మా హీరో బ్యానర్ మీద ఆయన ఫోటో ఎందుకు ఉండాలి అంటూ కాళ్ళ కింద వేసుకొని తొక్కి పడేశారు. ఈ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ పక్కన చూడడానికి కూడా అభిమానులు అసలు ఒప్పుకోవడం లేదు. అదే స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు కూడా బాలయ్య విషయంలో వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటివరకు తారక్ ఎలాంటి కామెంట్ చేయకపోవడం.. కనీసం ఒక బైట్ కూడా విడుదల చేయకపోవడంతో పూర్తి స్థాయిలో అతన్ని దూరం పెట్టారు నందమూరి అభిమానులు. ఊహించిన దాని కంటే ఈ విషయం ఇంకా పెద్దది అయిపోయింది. నిజానికి ఆ మధ్య ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ రానప్పుడే తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాత జయంతి కంటే నీ బర్త్ డే ఎక్కువైపోయిందా అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా సమయంలో ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య వివాదాలు మరోసారి బయటపడ్డాయి. ఇవింకా ఏ స్థాయికి వెళ్తాయి అనేది ఆసక్తికరమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

