శ్రీహరి, హెబ్బా పటేల్, వెంకట్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకుడు. డాక్టర్ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరి ఫస్ట్‌లుక్ పోస్టర్ని, గ్లింప్స్‌ని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ లాంచ్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అవుట్‌పుట్ బాగా వచ్చిందని, అందరికీ నచ్చే సినిమా అవుతుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. సుమన్, సలోని, అలీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సంగీతం మణి జీనా.