‘మేం ఓ రియల్లైఫ్ను తెరపై చూపించాం. ఇంతగొప్ప సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తే ‘లవ్ అనే కాన్సెప్ట్‌తో లవ్‌లో పడతారు’ అని హీరో హర్షిత్‌రెడ్డి అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన యువతరం ప్రేమకథ ‘దీవాన’. స్మేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకుడు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలు. శనివారం విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్నది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్లో హీరో హర్షిత్‌రెడ్డి మాట్లాడారు. ఇంకా చెబుతూ ‘ఇదొక టైమ్‌లెస్ లవ్‌స్టోరీ. చూసినవారంతా అభినందిస్తుంటే ఆనందంగా ఉంది. నటుడిగా నాకు తెలియని కోణాన్ని నాకే చూపించిన సినిమా ఇది’ అని హర్షిత్‌రెడ్డి అన్నారు. ఇది శతదినోత్సవం జరుపుకునే సినిమా అని, ఇందులో రియాలిటీ, కమర్షియాలిటీ రెండూ ఉన్నాయని, తెరపై హీరోహీరోయిన్ల బాధను ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారని దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి చెప్పారు.