Music Director | ఒక్క విజయంతో ఎవరి జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో మనం ఊహించలేము. ఇది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ జర్నీకి ఖచ్చితంగా సరిపోతుంది. తక్కువ కాలంలోనే పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ సంగీత దర్శకుడి జాబితాలో ఇప్పుడు స్టార్ హీరోల ప్రాజెక్టులే దర్శనమిస్తున్నాయి. గతంలో అర్జున్ రెడ్డి చిత్రానికి సంగీతం అందించినప్పటికీ, అతని పేరు పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ ‘యానిమల్’ సినిమా వచ్చిన తర్వాత మాత్రం హర్షవర్ధన్ కెరీర్ ఊపందుకుంది. యానిమల్ చిత్రం సంగీతం ప్రేక్షకులను మాత్రమే కాకుండా పరిశ్రమవర్గాల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సినిమా విజయం హర్షవర్ధన్‌కు డైరెక్ట్‌గా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయినట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్‌కు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. విజయ్ సేతుపతి కొత్త లుక్‌లో బిచ్చగాడిగా కనిపించనున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ మ్యూజిక్ మరో హైపును తీసుకొస్తుందని భావిస్తున్నారు.
అంతే కాకుండా, స్టైలిష్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కొత్త ప్రాజెక్ట్‌కి కూడా హర్షవర్ధన్ సంగీతం అందించనున్నాడు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 8న మొదలైంది. ఈ ప్రెస్టీజియస్ సినిమాకు కూడా మ్యూజిక్ అందించే అవకాశాన్ని హర్షవర్ధన్ దక్కించుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ చిత్రాలు మంచి విజయం సాధిస్తే మాత్రం రానున్న రోజులలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ హవా మాములుగా ఉండదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన పేరు ఇంకో లెవెల్‌కు చేరనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.