Harom Hara | టాలీవుడ్ యువ నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి పోస్టర్లతో పాటు టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి చిత్రయూనిట్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చింది.
ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘హరోంహర హర’ అనే సాంగ్‌ను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మూవీ నుంచి సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా రానుంది.. ఈ మూవీలో మాళవిక, సునీల్ రవి కాలే, కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్, అర్జున్ గోవిందా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శిఖరానా ఉండే సామి ఏంటికి నన్ని మీకాడికి పంపుతాండడో సెప్పే పాట ఈ పదనాల్గో తేదీ వస్తా ఉండాది!#HaromHaromHara#HaromHara First single will be out on 14th Feb at 5:00PM💥@ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic @SSCoffl @JungleeMusicSTH pic.twitter.com/9QcoV7D5yX
— Sudheer Babu (@isudheerbabu) February 12, 2024