‘మంచి సినిమా తీస్తామని ముందునుంచీ చెబుతున్నాం. ఇప్పుడదే జరిగింది. ఎక్కడ చూసినా అద్భుతమైన రెస్పాన్స్. దర్శకులు మారుతీ, సంపత్‌నంది ఫోన్లు చేసి మరీ అభినందించారు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు నిర్మాతలు సుబ్రహ్మణ్యం, సుమంత్.
వారు నిర్మించిన యాక్షన్ డ్రామా ‘హరోంహర’. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడారు. ప్రభాస్, రామ్‌చరణ్‌లతో కూడా సినిమాలు నిర్మించాలని ఉందంటూ.. తమ సంస్థనుంచి మరో రెండుప్రాజెక్టులు రానున్నాయని, ఆ వివరాలు త్వరలో చెబుతామని సుబ్రహ్మణ్యం, సుమంత్ అన్నారు.