సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ ఉపశీర్షిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పసుపు రంగు దీక్షా దుస్తులు ధరించి, శరీరమంతా రక్తమోడుతూ ఆగ్రహంగా కనిపిస్తున్నారు సుధీర్‌బాబు. అతని వెనక గ్రామస్తులు నిలబడి ఉన్నారు.
‘చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే కథ ఇది. ఆద్యంతం ఊహకందని మలుపులతో కథ, కథనాలు ఉంటాయి. సుధీర్‌బాబు గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. దీపావళికి టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాణ సంస్థ: శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక.