Bigg Boss 8 Hariteja | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే పది వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న 11వ వారంలోకి ఎంటర్ అయ్యింది. అయితే పదోవారం ఊహించని విధంగా హౌజ్ నుంచి హరితేజ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటికే శనివారం హౌజ్ నుంచి గంగవ్వ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో భాదపడుతున్న గంగవ్వ తనంతట తానే హౌజ్ బయటకు వచ్చేసింది. ఇక పదోవారం నామినేషన్స్ చూసుకుంటే.. గౌతమ్, నిఖిల్, ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ఉన్నారు. ఇందులో గౌతమ్‌కు అత్యధిక ఓట్లు వచ్చినట్లు తెలుస్తుండగా.. గౌతమ్ తర్వాత నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ ఉన్నారు. ఇక డేంజర్ జోన్లో యష్మి, హరితేజ ఉండగా.. ఎలిమినేషన్‌కు సంబంధించి ఫ్రీ ఎవిక్షన్ షీల్డ్‌ను ఉపయోగిస్తావా అని నబీల్ను నాగార్జున అడుగుతాడు. దీనికి నబీల్ నో చెప్పడమే కాకుండా.. తన కోసం మాత్రమే ఆ ఎవిక్షన్ షీల్డ్ వాడుకుంటానని చెప్పాడు. దాంతో ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న హరితేజ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలిపారు.
వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది హరితేజ. అంతకుముందు సీజన్ 1లో తనదైన ఆటతీరుతో సత్తా చాటిన హరితేజ ఈ సీజన్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హౌస్‌లో ఉన్నంతకాలం చలాకిగా కనిపించిన ఆమె ఆట తీరు బాగున్నప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడంతో పెద్దగా ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ కాలేదని చెప్పవచ్చు. బహుషా ఈ కారణంతోనే ఆమె ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది.
ఇక సీజన్ 8కి సంబంధించి 5 వారాలు హౌజ్‌లో గడిపిన హరితేజ పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఒక వారానికి గాను రూ. 3.5 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక 5 వారాల పాటు హౌజ్‌లో ఉండగా.. సుమారు రూ. 17 లక్షలకు పైగా అందుకున్నట్లు తెలుస్తుంది.