LGM | స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి సింగ్ హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner) నుంచి వస్తున్న డెబ్యూ ప్రాజెక్ట్ ఎల్జీఎం (Lets Get Married). హరీష్ కల్యాణ్ హీరోగా నటిస్తుండగా.. లవ్‌టుడే ఫేం ఇవానా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రమేశ్ తమిళ్మని (Ramesh Thamilmani) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఎల్జీఎం ట్రైలర్ (LGM Trailer) యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేసింది.
జులై 28న తమిళం, తెలుగుతోపాటు వివిధ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఎల్జీఎం ప్రమోషన్స్‌లో భాగంగా హరీష్ కల్యాణ్ టీం నేడు కోయంబత్తూరులో ల్యాండింగ్ అయింది. హీరోతోపాటు ఎల్జీఎం టీం అక్కడి కాలేజ్ ఈవెంట్లో పాల్గొననుంది. అనంతరం ప్రెస్‌మీట్ కూడా ఏర్పాటు చేయనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి నదియా, పాపులర్ కమెడియన్ యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధోనీ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
మీరాతో ప్రేమలో ఉన్న గౌతమ్.. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మతో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అలా ఉండటం ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరాకు, అమ్మకు మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు గౌతమ్. మరి ఇవానా కాబోయే అత్తమ్మతో సౌకర్యవంతంగా ఫీలవుతుందా..? లేదా..? ఆ తర్వాత జరిగే కథేంటనే నేపథ్యంలో సినిమా కథ సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పాడు డైరెక్టర్. లవ్‌టుడే సినిమాతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించిన ఇవానా..ఎల్జీఎంతో ఎలాంటి క్రేజ్ కొట్టేస్తుందో చూడాలంటున్నారు సినీ జనాలు.
Dashing @iamharishkalyan lands at Coimbatore for promoting LGM at a college event. The team of #LGM will also address a press meet today. LGM from July 28 in theatres#LGMFromJuly28@DhoniLtd @msdhoni @SaakshiSRawat @Ramesharchi @i__ivana_ @ActressNadiya @iyogibabu… pic.twitter.com/opGFXLJl7u
— BA Raju’s Team (@baraju_SuperHit) July 21, 2023
ఎల్జీఎం ట్రైలర్..
ఎల్జీఎం టీజర్..