Harish Shankar | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ రిలీజ్‌కు ముందు,ఆ తర్వాత కూడా దూకుడుగా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. హీరో ప్రమోషన్స్‌లో పెద్దగా కనిపించకపోయినా, సినిమా ప్రచార బాధ్యతను పూర్తిగా తన భుజాలపై వేసుకుని ముందుండి నడిపించారు హరీష్ శంకర్. అయితే సినిమా బాక్సాఫీస్ ఫలితాలపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్‌పై ట్రోలింగ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా స్పందిస్తూ ట్రోల్స్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్లు శ్రీలీల, రాశీ ఖన్నాతో కలిసి నిర్వహించిన చిట్‌చాట్‌లో హరీష్ మాట్లాడుతూ… “ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరికైనా ట్రోల్ చేయడం చాలా సులభం. కానీ నేను వాటిని సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే ట్రోలర్స్‌కి ఐడెంటిటీ ఉండదు. నేను మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత వహిస్తాను. కానీ వాళ్లకి ఆ బాధ్యత ఉండదు” అని అన్నారు. అసభ్యకరంగా దూషించినప్పుడు మాత్రం తాను స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు. హద్దులు దాటితే బ్లాక్ చేస్తాను లేదా అవసరమైతే కంప్లయింట్ ఇస్తాను. లేదంటే ఎక్కువగా పట్టించుకోను అని తెలిపారు. డైరెక్టర్ అవ్వాలనుకున్న సమయంలో తన తల్లిదండ్రులే విమర్శించారని, అందుకే ట్రోల్స్ తనకు కొత్తేమీ కాదని చెప్పారు.
సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకుంటూ… ఇంత పెద్ద సినిమా తీసేటప్పుడు చివరి నిమిషంలో మ్యూజిక్ డైరెక్టర్ మారడం, రిలీజ్ డేట్ ముందుకు రావడం వంటి ఒత్తిడులు ఎదురయ్యాయి. అయినా కూడా సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నాకు పెద్ద సక్సెస్” అని పేర్కొన్నారు. సినిమా అవుట్‌పుట్ విషయంలో నేను పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. ప్రేక్షకులు సినిమా చూసి ప్రశంసిస్తున్నారు. నా శక్తికి మించి పని చేశాను అని హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ట్రోలింగ్‌పై ఇచ్చిన కౌంటర్ చర్చకు దారితీస్తోంది.