టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్‌శంకర్ (Harish shankar) వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పేరు ATM. హీస్ట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్ వార్తల్లో నిలిచింది. సీ చంద్రమోహన్ డైరెక్షన్లో జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫాం తెరకెక్కిస్తున్న ఏటీఎం ప్రీమియర్ డేట్‌ను ఫైనల్ చేశారు మేకర్స్. తాజా అప్డేట్ ప్రకారం ఏటీఎం జనవరి 20న ప్రీమియర్ కానుంది.
ఈ విషయాన్ని స్పెషల్ వీడియో ద్వారా తెలియజేస్తూ విడుదల తేదీని ప్రకటించింది జీ5 తెలుగు. ఏటీఎంలో బిగ్ బాస్ ఫేం వీజే సన్నీ, సుబ్బరాజు, రోయెల్ శ్రీ, రవిరాజ్, కృష్ణ బూర్గుల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను హర్షిత్ రెడ్డి, హన్షిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహార్ సంగీతం అందిస్తున్నారు.
హరీష్ శంకర్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad bhagat singh) సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అయానంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ATM ప్రీమియర్ డేట్ వీడియో..
A heist that will make you relook at your way of life & startle you to your very core.#ATMOnZee5 – The game of money, #PaisalThoAata, STARTS SOON@VJSunnyOfficial @actorsubbaraju @RoielShree @ravirajdance @KrishnaBurugula @DiviActor@harish2you @chandramohan_c @DilRajuProdctns pic.twitter.com/rKkoheUOQ2
— ZEE5 Telugu (@ZEE5Telugu) January 6, 2023