Ustaad Bhagat Singh | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తవగా.. కొన్ని పోర్షన్లు మిగిలి ఉన్నాయని సమాచారం.
తాజా టాక్ ప్రకారం డైరెక్టర్ హరీష్ శంకర్ లాంగ్ ఫైనల్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాడట. నవంబర్ చివరి వారం నుంచి మొదలు కానున్న ఈ షెడ్యూల్ డిసెంబర్ మూడో వారం వరకు కొనసాగనుందని ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ టీం విడుదల తేదీ అనౌన్స్‌మెంట్‌పై ఏ మాత్రం తొందరపడకుండా ఫైనల్ ఔట్పుట్ రెడీ అయిన తర్వాతే స్పష్టత ఇవ్వాలనుకుంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే లాంచ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Dies Irae | మోహన్‌లాల్ కొడుకు కొత్త మూవీ.. ‘డీయాస్ ఈరే’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Peddi First Single | ‘పెద్ది’ అప్డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ వీడియో పంచుకున్న టీమ్
Mira Nair Son | న్యూయార్క్ మేయర్‌గా భారతీయ దర్శకురాలి కొడుకు.. ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?