Harish Shankar | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో పాటు వివాదాస్పద పోస్టులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాడు టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్. నెటిజకు రిప్లయ్ ఇవ్వడంతో పాటు తన మూవీ అప్డేట్లను అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటాడు. అయితే తనకు వ్యతిరేకంగా ఎవరైన పోస్టులను పెడితే.. బ్లాక్ చేయడం కూడా చేస్తూ ఉంటాడు. ఇదిలావుంటే ఎక్స్‌లో హరీశ్ శంకర్‌కి కాట్రవల్లీ అనే పేరుతో ఇంకో అకౌంట్ ఉందని ఆ అకౌంట్ నుంచి తనను తిట్టే వారిని కౌంటర్ ఇస్తాడని నెటిజన్లు అంటుంటారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు హరీశ్ శంకర్.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ హరీశ్ శంకర్‌ను అడుగుతూ.. మీకు ఎక్స్‌లో రెండు అకౌంట్స్ ఉన్నాయా అని అడుగుతాడు.
దీనికి హరీశ్ శంకర్ సమాధానమిస్తూ.. కొంతమంది నాకు ఎక్స్‌లో రెండు అకౌంట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు. నాకు రెండు అకౌంట్స్ లేవు. కావాలంటే సైబర్ క్రైమ్ వెళ్లి చెక్ చేసుకోవచ్చు. నేను ఏమైనా అనాలి అనుకుంటే డైరెక్ట్‌గా అంటా అంతేకాని ఫేక్ ఖాతాలతో మాట్లాడను అంటూ తెలిపాడు. అయితే కాట్రవల్లీ అనే పేరుతో ఉన్న అకౌంట్ అతను తనకు వీరాభిమాని. సోషల్ మీడియాలో నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. అయితే అతడికి ఒకటే చెప్పాను. ఏ విషయం పైనా మాట్లాడు కానీ బుతులు వద్దు. ఒకరు మాట్లాడుతున్నారని మనం కూడా బుతులు మాట్లాడవద్దు అంటూ హరీశ్ శంకర్ చెప్పకోచ్చాడు.
నాకు Alternative Account అవసరం లేదు. అతను నా వీరాభిమాని – #HarishShankar pic.twitter.com/peHVnW0eGB
— Rajesh Manne (@rajeshmanne1) August 8, 2024