Keeravani |సింగర్ ప్రవస్తి రీసెంట్గా సునీత, చంద్రబోస్‌లతోపాటు కీరవాణిపై సంచలన ఆరోపణలు చేయడం మనం చూశాం. ముఖ్యంగా కీరవాణిపై కూడా పలు ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. కొన్ని టీవీ ఛానెల్స్ అయితే ప్రవస్తిని పిలిచి మరీ డిబేట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో లేడీ సింగర్ హరికా నారాయణ్ స్పందిస్తూ.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై ప్రశంసలు కురిపించింది..ఓ టీవీ ఛానెల్లో తన వీడియో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కీరవాణి ఎలాంటి వారో తెలియజేసింది.
హారిక నారాయణ తన ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేయగా, ఇందులో తాను మాట్లాడుతూ.. నేను ప్రైవేట్ సాంగ్(వీక్షణ)ని ప్రమోట్ చేసుకుంటూ వీడియో పెట్టాను. దాన్ని టీవీలో చూపించి వ్యంగ్యంగా మాట్లాడటం
అస్సలు నచ్చలేదు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఎలా చూపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది హారికా.అయితే వీక్షణ అనే తన ప్రైవేట్ సాంగ్‌ని లెజెండ్ కీరవాణి చేతుల మీదుగా ఆయన ఆశీస్సులతో విడుదల చేయడం జరిగిందని, దీన్ని రీల్ కింద పోస్ట్ చేసినట్టు చెప్పుకొచ్చింది హారికా నారాయణ్. అయితే ఒక టీవీ ఛానెల్లో తన వీడియోని రాంగ్ కాంటెక్ట్స్ లో వినియోగించి దానిపై జడ్జ్ మెంట్ పాస్ చేయడం నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఒక లెజెండరీ పర్సన్ ఒక చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయన కొత్త వారిని ఎలా ఎంకరేజ్ చేస్తారనేదానికి ఉదాహరణగా చెప్పొచ్చు
ఆ వీడియోలో కీరవాణిగారి ముందు నేను నిలుచోవడానికి కారణం ఆయన్ని తాను గురువులా భావించి ఇచ్చిన మర్యాద. కీరవాణి దగ్గర పనిచేసే ఏ సింగర్నైనా, ఏ మ్యూజీషియన్ ని అయినా అడగొచ్చు ఆయన ఎలాంటి వారు అనేది, ఆయన వ్యాల్యూస్ ఎలాంటివో, సాటి మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో అని. మ్యూజిక్ మాత్రమే కాదు విలువలు, జీవితానికి సంబంధించి ఆయన వద్ద నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది పూర్తిగా నా ఫీలింగ్. అలాంటి వ్యక్తి గురించి నిజం తెలుసుకోకుండా రాంగ్గా చెప్పడం నచ్చలేదు, అగౌరవంగా అనిపించింది. ఈ నెగటివిటీని ఇకపై ఆపేస్తారని భావిస్తున్నా అంటూ హారికా నారాయణ్ స్పష్టం చేసింది.