Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా, కొన్ని కారణాల వల్ల వాయిదాలు ఎదుర్కొంటూ చివరకు జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్లింది. దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా ప్రీమియర్ షోలుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది.పవన్ అభిమానులు సినిమాని ఆకాశానికి ఎత్తేస్తుండగా, సినీ లవర్స్ మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దయాకర్ రావు నిర్మాణంలో, ఏఎం రత్నం సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ బిజినెస్ జరుపుకుంది. నైజాం – ₹37 కోట్లు, సీడెడ్ – ₹16.5 కోట్లు, ఉత్తరాంధ్ర – ₹12 కోట్లు, ఈస్ట్ గోదావరి – ₹9.5 కోట్లు, వెస్ట్ గోదావరి – ₹7 కోట్లు, గుంటూరు – ₹9.5 కోట్లు, కృష్ణా – ₹7.5 కోట్లు, నెల్లూరు – ₹4.5 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే ₹103 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తయింది. కర్ణాటకతో పాటు ఇతర భారతీయ రాష్ట్రాలు – ₹12 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ – ₹10 కోట్లు ఇలా మొత్తం కలిపితే వరల్డ్ వైడ్ బిజినెస్ – ₹126 కోట్లు జరిగింది. అంటే, సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం ₹127 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ టార్గెట్ సాధ్యమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటికే ₹35 కోట్లు వసూలయ్యాయని సమాచారం. అయితే ఇప్పుడు మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో 127 కోట్ల టార్గెట్‌ను అందుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తుననారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్ర కథ మొఘల్ సామ్రాజ్యంలో జరిగే చారిత్రక ఘటనలు, కోహినూర్ డైమండ్ చుట్టూ తిరుగుతుంది.ఈ సినిమా క్లైమాక్స్ లోని యాక్షన్ సీక్వెన్స్‌కి తానే కొరియోగ్రఫీ చేసినట్లు తెలిపారు. అయితే దానిపై కూడా కొందరు పెదవి విరుస్తున్నారు. మరి ఈ చిత్రంతో నిర్మాతలు గట్టెక్కుతారా లేదా అనేది చూడాలి.