Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ మూవీ థియేటర్లలో మంచి హైప్‌తో దూసుకెళ్తోంది. జూలై 24న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల పరంగా బాగానే రాణిస్తోంది. ఫస్ట్ డేనే రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్గా నిలిచిన ఈ చిత్రం, రెండో రోజు నుంచి మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. మూడో రోజు మళ్లీ ఊపందుకుంది. నాల్గో రోజుకు రూ.10 కోట్లకు మించి వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, చిత్రం నాలుగు రోజుల్లో రూ.105 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
షేర్ పరంగా ఇది రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. అయితే, ఈ సినిమా బ్రేక్ కావాలి అంటే రూ.125-130 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరం. మరి ఆ లక్ష్యం చేరుకుంటుందా అన్నదే ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. 51 శాతం రికవరీ చేసిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 78.30 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 62.48 కోట్ల వసూళ్లు రాబట్టాల్సింది అని చెబుతున్నారు. సినిమా విడుదల తర్వాత వీఎఫ్ఎక్స్ పరంగా కొంత విమర్శలు ఎదురైన నేపథ్యంలో, మేకర్స్ ఫైనల్ వెర్షన్‌ను థియేటర్లకు పంపారు. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడంతో పాటు, కొత్త విజువల్ ఎఫెక్ట్స్‌తో మళ్ళీ రిలీజ్ చేశారు. కొత్త వర్షెన్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
ఇక తెలుగు వెర్షన్ విజయవంతంగా ప్రదర్శితమవుతోంటే, హిందీ డబ్ వెర్షన్‌ను ఆగస్ట్ 1న విడుదల చేయనున్నారు. బాలీవుడ్లో పవన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఇది మంచి రీచ్ సాధించవచ్చని యూనిట్ ఆశిస్తోంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 17వ శతాబ్దం నేపథ్యంగా రూపొందగా, ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్ ప్రధాన విలన్‌గా ఆకట్టుకున్నారు. సునీల్, నాజర్, కబీర్ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించగా, మొదట దర్శకత్వ బాధ్యతలు క్రిష్ చేపట్టినా, చివరకు జ్యోతికృష్ణ పూర్తిచేశారు. వచ్చే వారం హిందీ వెర్షన్ విడుదల కానుండగా, అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంటే హరి హర వీరమల్లు బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేయడం కష్టమేమీ కాదు.చూడాలి మరి ఏం జరుగుతుందో.!