Hari Hara Veeramallu | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సంచలన రికార్డులు సృష్టించడంతో, సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ గతంలోని అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన ట్రైలర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించింది.
అయితే, చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ కొందరు ఈ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయిన కూడా ఆ సమస్యలన్నింటిని సాల్వ్ చేసుకొని రిలీజ్‌కి సిద్ధమవుతుంది హరిహర వీరమల్లు చిత్రం. తాజాగా మూవీ రన్టైమ్కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఓ విదేశీ బుకింగ్ వెబ్సైట్లో సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలు (160 నిమిషాలు) గా చూపించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే చిత్రబృందం దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇటీవల ‘కుబేర’, ‘కన్నప్ప’ లాంటి సినిమాలు మూడు గంటలకు పైగా ఉండటంతో నెగటివ్ టాక్ వచ్చిందన్న విషయాన్ని గుర్తించిన మేకర్స్ హరిహర వీరమల్లు సినిమాని తక్కువ రన్టైమ్తో రిలీజ్ చేయబోతున్నారట.
తక్కువ రన్‌టైమ్ ఉన్నప్పటికీ అందులో బలమైన కంటెంట్ ఉంటుందట. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రాబిన్‌హుడ్ తరహాలో, మొఘలుల కాలం నాటి వీరుడిగా కనిపించనున్నారు. ధనికుల దగ్గర దోచుకుని పేదలకు పంచే పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. అత్యాధునిక గ్రాఫిక్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, చారిత్రక సెట్స్‌తో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం, పైగా ఆయనకు రాజకీయంగా పెరిగిన ఇమేజ్ ఈ సినిమాపై అంచనాలని పెంచుతుంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.