Hari Hara Veeramallu | డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న తొలి చిత్రం హరి హర వీరమల్లు. ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రం పలు వాయిదాలు పడి ఎట్టకేలకి జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2025 సెకండాఫ్‌లో విడుదలయ్యే తొలి పాన్ ఇండియా భారీ చిత్రం కావడం, పైగా ట్రైలర్‌కు వచ్చిన హైప్ కారణంగా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యాన్స్ ఇప్పటికే థియేటర్ల వద్ద వేడుకలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే… ఈ సినిమాకి ఊహించని రూపంలో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అందుకు కారణం.. ‘హరిహర వీరమల్లు’ విడుదలైన వారం రోజులకే మరో క్రేజీ చిత్రం ‘కింగ్డమ్’ రాబోతోంది
ఫస్టాఫ్‌లో టాలీవుడ్ చిత్ర సీమకి అంత భారీ విజయాలు లేవు. ఆ దాహం హరిహర వీరమల్లుతో తీరనుందని అందరు భావిస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన వారానికి విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ రిలీజ్ కానుంది. దీంతో పవన్ సినిమా టాక్ బాగున్నా కూడా, కలెక్షన్ల విషయంలో కాస్త గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు సినిమాకు భారీ బడ్జెట్ వెచ్చించారనే విషయం తెలిసిందే. బిజినెస్ కూడా పెద్ద మొత్తంలో జరిగింది. అయితే తాజా పరిస్థితుల్లో బయ్యర్లు డైలమాలో పడిపోతున్నారు. ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ ప్రకటన తరువాత ఇప్పుడు వాళ్లలో సందేహాలు మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘కింగ్డమ్’ సినిమాకు విడుదలైన తాజా గ్లింప్స్‌కు విశేష స్పందన లభించింది. ఇదే విషయమే ‘వీరమల్లు’ బయ్యర్లలో మరింత టెన్షన్‌కు కారణమవుతోంది. విజయ్ దేవరకొండ స్టార్ డమ్ పవన్ కళ్యాణ్ స్థాయి కాదు. కానీ “కింగ్డమ్” ఫీల్, విజువల్స్, ప్రమోషన్ తీరును చూస్తుంటే యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోంది.
ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద సినిమాలు ఫుల్ హైప్‌తో మొదటి మూడు రోజుల్లోనే కలెక్షన్లు రాబట్టి, తర్వాత డ్రాప్ కావడం గమనించవచ్చు. కానీ ‘వీరమల్లు’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ఫస్ట్ వీకెండ్ సరిపోదు. రెండో వారం మంచి స్పేస్ లభించాల్సిందే. లేకపోతే బ్రేక్ ఈవెన్ చేరడం కష్టమే. కాని దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ధీమాగా ఉన్నారు. ఏ హీరో సినిమా వచ్చినా… మా సినిమాని ఆపలేదు? అంటూ కాన్ఫిడెంట్‌గానే ఉన్నారు. కానీ ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘వీరమల్లు’ టాక్, రన్ టైం, రివ్యూస్ బలంగా ఉంటే తప్ప ‘కింగ్డమ్’ ప్రభావాన్ని ఎదుర్కోవడం కష్టం. మరి… జులై రెండో భాగంలో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకుంటాయో చూడాలి.