అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం అంటే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన ఖాతాలో కర్తవ్యం, భారతీయుడు, ఖుషి వంటి విశేషజనాదరణ పొందిన చిత్రాలున్నాయి. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఎ.ఎం.రత్నం తెరకెక్కించిన ‘హరిహరవీరమల్లు’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులు. ఈ సందర్భంగా శనివారం నిర్మాత ఎ.ఎం.రత్నం పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..