Hari Hara Veera Mallu| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ప్రజల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో సినిమాలు త్వరగతిన పూర్తి చేయడం ఇబ్బందిగా మారింది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎప్పుడో విడుదల కావల్సిన ఈ చిత్రం తాజాగా మరోసారి వాయిదా పడింది.’హరి హర వీరమల్లు’ చిత్రాన్ని తొలుత ఈ నెల 28న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఇప్పుడు మే 9వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు హోలీతో పాటు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేశారు.
కొత్త పోస్టర్ విడుదల చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పోస్టర్లో పవన్, నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో టీమ్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో, పవన్‌కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు.మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో మూవీ తెరకెక్కుతోంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా, బాబీ డివోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు నిర్మిస్తుండగా, దానికి ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు.
క్రిష్ జాగర్లమూడి కొంత ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాని పలు కారణాల వలన ప్రాజెక్ట్ జ్యోతికృష్ణ చేతికి వెళ్లింది. ఇక ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందింస్తున్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని నెలలకే ప్రచారం అంటూ పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో మూవీకి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ఏపీలో ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు జనసేనాని