 
                                                            Pawan Kalyan | ఏపీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి 70,354 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుంధుభి మోగించారని తెలిసిందే. రికార్డు మెజారిటీతో గెలుపొంది అభిమానులకు తన గెలుపును బహుమతిగా అందించారు. పవన్ కల్యాణ్ ఇక అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుండటంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు సంబురాలు చేసుకుంటున్నారు.
కాగా పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ధర్మం దే విజయం అంటూ సినిమాలో వచ్చే డైలాగ్‌ను గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేకర్స్. విక్టరీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పవన్ కల్యాణ్, అభిమానుల కోసం విడుదల చేసిన నయా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. క్రిష్ హరిహరవీరమల్లు ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేయగా.. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా.. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
హరిహరవీరమల్లు నయా పోస్టర్..
“ధర్మం” దే విజయం ☝️
Congratulations to our Janasenani, Shri @PawanKalyan garu on the Momentous win at #AndhraPradesh Assembly Elections 2024. 👏🔥 – Team #HariHaraVeeraMallu ⚔️ pic.twitter.com/6voglyJy3v
— Mega Surya Production (@MegaSuryaProd) June 4, 2024
హరిహర వీరమల్లు  Part 1 టీజర్..
 
                            