Mega Updates | మెగా అభిమానులకు డబుల్ ధమాకా.. నేడు చిరు, పవన్ సినిమాల కీలక అప్డేట్స్!
Mega Updates | మెగా అభిమానులకు నేడు నిజంగా(డిసెంబర్ 13) పండగ వాతావరణం నెలకొంది.
Mega Updates | మెగా అభిమానులకు నేడు నిజంగా(డిసెంబర్ 13) పండగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రాల నుంచి ఒకే రోజు కీలక అప్డేట్స్ రాబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పతాక స్థాయికి చేరింది. ఈ రెండు సర్‌ప్రైజ్‌ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి 2026 రిలీజ్ లక్ష్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ నేడు అధికారికంగా ప్రకటించనుంది. సాయంత్రం 5 గంటలకు జరగనున్న గ్రాండ్ ప్రెస్ మీట్లో ఈ డేట్‌ను వెల్లడించనున్నారు. అలాగే ఈ చిత్రం నుంచి ఇది తొలి అవుట్డోర్ ప్రమోషనల్ కార్యక్రమం కావడం విశేషం.
మరోవైపు, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘డేఖ్‌లేంగే సాలా’ ఫుల్ వెర్షన్‌ను నేటి సాయంత్రం 5:30 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రాజమండ్రి సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ వేదికగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ కలిసిన ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ నుంచి మరో సెన్సేషన్ ఖాయమనే అంచనాలు మెగా ఫ్యాన్స్‌లో భారీగా ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

