Hari Hara Veera Mallu | నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. మరోవైపు ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.
ఇప్పటికే మూవీ నుంచి పవన్ కళ్యాణ్ పాడిన ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ అనే పాటను వదిలిన చిత్రబృందం తాజాగా విలన్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా మూవీ నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. బాబీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది.
జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Wishing the incomparable, the man of magnetic screen presence @thedeol a very Happy Birthday! – Team #HariHaraVeeraMallu ⚔️#HBDBobbyDeol 🔥
Power star 🌟 @PawanKalyan @AMRathnamOfl @AnupamPKher @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani @ADayakarRao2 @Manojdft… pic.twitter.com/frklEumhjM
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 27, 2025