హరనాథ్ పొలిచర్ల, స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నా తెలుగోడు’. తనికెళ్ల భరణి, రఘుబాబు, జరీనా వహాబ్, నైరాపాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకులు శివ నిర్వాణ, మహేశ్‌బాబు, స్వరూప్, మైత్రీ నవీన్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
చిత్ర హీరో, దర్శక,నిర్మాత హరనాథ్ పొలిచర్ల మాట్లాడుతూ ‘అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రేరణతో ఈ సినిమా చేశాను. తెలుగోడు సమాజంలో ఎక్కడున్నా మంచి కోసం ఎలా పోరాడతాడో, ఎలా కష్టపడతాడో, ప్రతిభావంతంగా ఎలా ముందుకెళ్తాడో ఈ సినిమాలో చూపించాను. శిశువులను కాపాడే ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో అమ్మ గురించి, సైనికుల గురించి, సమాజంపై డ్రగ్స్ చూపించే చెడు ప్రభావం గురించి చర్చించాం. తప్పకుండా అందరికీ సినిమా నచ్చుతుంది.’ అని తెలిపారు. ఇంకా చిత్రబృందం మొత్తం మాట్లాడారు.