Happy Patel | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న క్రేజీ మూవీ ‘హ్యాపీ పటేల్: ఖతర్నాక్ జాసూస్’ (Happy Patel: Khatarnak Jasoos). ఈ సినిమాకు ప్రముఖ స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ (Vir Das) దర్శకత్వం వహించడంతో పాటు ప్రధన పాత్రలో నటిస్తున్నాడు. ‘ఢిల్లీ బెల్లీ’ తర్వాత ఆమిర్ ఖాన్ – వీర్ దాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు దీనిపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.. ఈ చిత్రం జనవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. అమెరికాలో ఉన్న ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి తన జీవితంలో అనుకోకుండా గూఢచారిగా మారాల్సి వస్తే ఎదురయ్యే పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా కథ. ట్రైలర్ ఆద్యంతం వీర్ దాస్ మార్క్ కామెడీతో, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ మార్క్ ప్రమోషన్ స్ట్రాటజీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలో వీర్ దాస్‌తో పాటు మోనా సింగ్, మిథిలా పాల్కర్, షరీబ్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా చాలా కాలం తర్వాత ఇమ్రాన్ ఖాన్ వెండితెరపై కనిపించబోతుండడం విశేషం.