Nidhhi Agerwal | మున్నామైఖేల్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది హైదరాబాదీ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). సవ్యసాచి సినిమాతో తెలుగులో డెబ్యూ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సుందరి ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తున్న నిధి అగర్వాల్ పుట్టినరోజు (Birthday) నేడు. ఈ సందర్భంగా మూవీ లవర్స్, ఫాలోవర్లు, నెటిజన్లు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. హరిహర వీరమల్లులోని అందమైన లుక్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ చిత్రంలో పంచమిగా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాట్యం చేస్తున్న స్టిల్‌ను నిధి అగర్వాల్ షేర్ చేయగా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టయితే నిధి పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ తెచ్చుకోవడం పక్కా అని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు షూటింగ్‌కు సంబంధించి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.

Nidhiagerwal

Nidhiagerwal1

Nidhhi Agerwal3

Hhvm

Hhvm1

Hhvm2