Hanuman Trailer | అ!, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ సినిమాల ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఇక ఈ మూవీ తొలి తెలుగు సూపర్ హీరో సినిమాగా రానుంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కాగా రీసెంట్గా సెకండ్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్‌ను నవంబర్ 28న విడుదల చేయనున్నట్లు చిత్రంబృందం సోషల్ మీడియాలో తెలిపింది. దీనితో పాటు హనుమాన్ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఇక ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్ చిత్రానికి గౌరహరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
#HanumanTuesday Update is here!
After the two captivating songs, gear up for the 3rd Single on 28th NOV 🎶
🌟ing @tejasajja123#HANUMAN from JAN 12th,2024💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Primeshowtweets @Chaitanyaniran @AsrinReddy… pic.twitter.com/E7pv3NQgSM
— Prasanth Varma (@PrasanthVarma) November 21, 2023