Hanuman Movie | టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ (Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల మార్కును అందుకుంది. ఇక రానున్న రెండు రోజులు వీకెండ్ రావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కించగా.. కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాను జనాలు క్యూ కడుతున్నారు.
GLORY TO HANUMAN! 🙏🏽 pic.twitter.com/a8E6w9U1Gi
— Prasanth Varma (@PrasanthVarma) January 19, 2024