ప్రశాంత్ వర్మ హనుమాన్ ఎవరో తెలుసా?

విభిన్న కథా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు . నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమాతో ప్రశాంత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత యాంగ్రీ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఆతర్వాత మరో సరికొత్త జోనర్ లో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు జాంబీల కథతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఇటీవల హను-మాన్ అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఫిక్షనల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయాన్ని తాజాగా ప్రకటించారు. తేజ సజ్జా హీరోగా రూపొందనున్న ఈ చిత్రం కొద్ది సేపటి క్రితం ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అతి త్వరలోన మూవీ షూటింగ్ జరపనున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
. @PrasanthVarma’s #HanuMan,The First Original Superhero Film in Telugu,has launched with a formal Pooja Ceremony
— BA Raju's Team (@baraju_SuperHit) June 25, 2021
🎬C.Kalyan
🎥Switchon GeminiKiran
First Shot Dir ShivaShaktiDatta
🌟ing @tejasajja123
💰@Niran_Reddy @chaitanyaniran @asrinreddy @Primeshowtweets #HanuManTheOrigin pic.twitter.com/Mvh2JJo8eK
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

