ప్రముఖ తార హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నది. బాల్య స్నేహితుడు సొహైల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నది. బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ దగ్గర సొహైల్ హన్సికకు తన ప్రేమను వ్యక్తీకరించి, ‘మ్యారీ మీ’ అని ప్రపోజ్ చేయగా..ఆమె తన అంగీకారాన్ని తెలిపింది. ‘ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రేమలోనే’ అనే క్యాప్షన్‌తో హన్సిక ఈ ఫొటోలను షేర్ చేసింది.
ఈ జంటకు పలువురు తారలు శుభాకాంక్షలు చెబుతున్నారు. డిసెంబర్ 4న ఆమె వివాహం రాజస్థాన్‌లోని ఓ కోటలో జరగనుంది. 2వ తేదీ నుంచే పెండ్లి సన్నాహాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నది.