Hansika | సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు ఇప్పుడు వారి పర్సనల్ డైరీలు లాగా మారిపోయాయి. చిన్న చేంజ్ కూడా పెద్ద వార్తలకు దారితీస్తుంది. అలాంటి సందర్భంలో స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మ్యారేజ్ లైఫ్‌లో ఇబ్బందులు వచ్చాయనే రూమర్స్ వినిపిస్తున్న సమయంలో, హన్సిక తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చిన్న మార్పు చేసింది. ఇంతవరకు “Motwani”గా ఉండే స్పెల్లింగ్‌ను “Motwanni” గా మార్చింది. ఇది చిన్న మార్పే అయినప్పటికీ, ఫ్యాన్స్ వెంటనే గమనించి, దీని వెనుక ఏదైనా పెద్ద విషయం ఉందా అని ఆలోచించడం ప్రారంభించారు. చాలా మంది దీన్ని విడాకుల రూమర్స్‌తో లింక్ చేశారు.
హన్సిక ఈ స్పెల్లింగ్ మార్పు సడెన్ నిర్ణయం కాదని, దీని వెనుక తల్లి మోనా మోత్వాని ఉన్నారని తెలుస్తుంది. తల్లికి న్యూమరాలజీపై విశ్వాసం కలిగివుండటం, ఫ్యూచర్‌కు పాజిటివ్ ఎనర్జీ తెచ్చేలా పేరు మార్చే ఆలోచన చేసినట్టు హన్సిక వివరించింది. తల్లీకూతుళ్ల మధ్య పెద్ద చర్చలు, గొడవలు కూడా జరిగాయని, చివరికి తల్లి చెప్పిన మేరకు ఈ మార్పుకు ఓకే చెప్పానని హన్సిక పేర్కొంది. ఇకపై తనను ఇదే స్పెల్లింగ్‌తో పిలవాలని కోరిన హన్సిక.. మిగతాది నా పర్సనల్ లైఫ్ అంటూ సరదాగా ముగించింది. ఇక హన్సిక, బిజినెస్ మ్యాన్ సోహైల్ ఖతురియాతో 2022 డిసెంబర్లో జైపూర్‌లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వారి లవ్ స్టోరీని “లవ్, షాదీ అండ్ డ్రామా” పేరుతో డాక్యు-సిరీస్‌గా కూడా రిలీజ్ చేశారు.
అయితే, 2025 నుండి జంట మధ్య గొడవలు జరిగాయని రూమర్స్ మొదలయ్యాయి. హన్సిక తన పెళ్లి ఫోటోలన్నీ ఇన్స్టాగ్రామ్ నుండి డిలీట్/ఆర్కైవ్ చేయడం, భర్త సోహైల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ప్రైవేట్లోకి మార్చడం, వారిద్దరూ పండుగల సమయంలో వేర్వేరుగా కనిపించడం ఈ రూమర్స్‌ను మరింత బలపరచింది. వారి విడాకులపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక హన్సిక తన కెరీర్‌ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించింది. “షక లక బూమ్ బూమ్ సీరియల్”, “కోయి మిల్ గయా” వంటి సినిమాలతో ప్రారంభించారు. తర్వాత దేశముదురు వంటి హిట్ సినిమాతో సౌత్‌లో స్టార్ హీరోయిన్గా స్థిరపడ్డారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో కూడా పలు సినిమాలు చేసింది హన్సిక.