అగ్ర కథానాయిక హన్సిక నటిస్తున్న ఓటీటీ వెబ్ సిరీస్ ‘ఎంవై3’. కొరియన్ సిరీస్ ‘ఐయామ్ నాట్లో రొబోట్’ ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హన్సిక ద్విపాత్రాభినయంలో కనిపించనుంది. అందులో ఒకటి రోబో పాత్ర కావడం విశేషం. ఈ సిరీస్ గురించి హన్సిక మాట్లాడుతూ ‘నా కెరీర్లోనే అత్యంత క్లిష్టమైన పాత్ర ఇది. స్క్రిప్ట్ చదివినప్పుడు చాలా సాధారణంగానే అనిపించింది. సెట్స్ మీదకు వెళ్లాక అసలు కష్టమేమిటో తెలిసొచ్చింది.
రోబో గెటప్‌లో కళ్లు ఏమాత్రం కదపకుండా రెండుమూడు నిమిషాల పాటు అలాగే ఉండిపోవడం ఓ సవాలుగా అనిపించింది. ఈ సిరీస్ నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. షూటింగ్ వెళ్లేముందు కొరియన్ సిరీస్‌ను చూడమని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ నాకు ఇష్టం లేదు. నాదైన సహజమైన నటన కనబరచాలని ఆ సిరీస్‌ను చూడలేదు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఆమె తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.