అనురాగ్, సంతోష్, సాయివిక్రాంత్ ప్రధాన పాత్రల్లో హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. టి.డి.ప్రసాద్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్‌నివ్వగా, నటుడు అలీ కెమెరా స్విఛాన్ చేశారు.
వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఆలీ, చమ్మక్‌చంద్ర, ఆటో రాంప్రసాద్, ఫణి, వినీత రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాలు.ఆర్, సంగీతం: టాన్తేజ్, రచన: దాసరి బ్రహ్మానందం, కుమార్ మల్లారపు, అశ్విన్.ఆర్, దర్శకత్వం: టీడీ ప్రసాద్‌వర్మ.