Hamsa Nandini | ఒక్కటవుదాం సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది పూణే భామ హంసానందిని (Hamsa Nandini). అధినేత, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, రుద్రమదేవి, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు క్రేజ్ మామూలుగా ఉండదు. నెట్టింట హాట్ హాట్ స్టిల్స్‌తో కుర్రకారు మనసు దోచేసే హంసానందిని ఈ సారి మాత్రం ఎవరూ ఊహించిన లుక్‌లోకి మారిపోయింది.
ఇంతకీ స్పెషల్ లుక్ వెనుక సీక్రెట్ ఏమై ఉంటుందనుకుంటున్నారా..? ఈ భామ ఆశ్రమానికి వెళ్లింది. సద్గురు (Sadhguru) చెప్పినట్లుగా.. ఆత్మసాక్షాత్కారం అంటే మీరు ఎంత మూర్ఖంగా ఉన్నారో గ్రహించడం. ప్రతిదీ ఇక్కడే ఉంది.. మీరు దానిని గ్రహించలేరు. నాకు నేను ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణంలో ఒక అనిర్వచనీయమైన శక్తి.. ఆ శక్తిని గ్రహించగలిగాను.. అంటూ గ్లామరస్ కోటెంట్ను దూరం పెట్టి.. సింపుల్ లుక్‌లో భుజాన సంచి వేసుకున్న స్టిల్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
హంసానందిని నయా యాంగిల్ ఇప్పుడు నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. హంసానందిని చివరగా గోపీచంద్ నటించిన పంతం చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత మరే కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. సుమారు ఏడాదిపాటు క్యాన్సర్‌తోపాటు పోరాడి 16 సైకిల్స్ కీమో థెరపీ తర్వాత ఆరోగ్యంగా కోలుకున్న విషయం తెలిసిందే.
As Sadhguru says, “Self realization means to realize how foolish you have been. Everything has been right here within you and you dint get it.”
For me, the moment I stepped into the ashram I could sense an undiscribable force….an energy. pic.twitter.com/qM81ejVRW8— Hamsa Nandini (@ihamsanandini) June 26, 2023
ఆశ్రమంలో హంసానందిని ఇలా..
Just made me realize what a beautiful feeling it is to be conscious and in the moment. Haven’t stopped smiling eversince. Thanks to Isha Foundation, Coimbatore, for inviting me and making this magic happen within me. 🙏#swanstories @ishafoundation pic.twitter.com/bw1sTtsNZq
— Hamsa Nandini (@ihamsanandini) June 26, 2023