టాలీవుడ్ (Tollywood) యువ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) నటిస్తున్న చిత్రం మను చరిత్ర (Manu Charitra). రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మేఘా ఆకాశ్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా పాటకు మంచి స్పందన వస్తోంది. కాగా మేకర్స్ మరో పాటను విడుదల చేశారు. హమేషా హమేషా (Hamesha Hamesha Song) అంటూ శివ, ప్రియా వడ్లమాని మధ్య వచ్చే పాటను రిలీజ్ చేశారు.
కనబడకనే తెగ తిరుగుతు నను వెతికిన తుమ్ సే మేరా..ప్యార్ హువా, పదపదమని నీ వెనకనే నను కదిపిన దిల్ సే మేరా అంటూ ప్రియా, శివ లవ్ ట్రాక్‌తో సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది. కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను రమ్య బెహెరా పాడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సస్పెన్స్‌గా సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.
శివ కందుకూరికి ఈ చిత్రంతో మంచి బ్రేక్ వచ్చేలా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు భరత్ పెదగాని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!