అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రధారులుగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘హైవాన్’ పేరుతో రూపొందనున్న చిత్రం షూటింగ్ శనివారం ప్రారంభమైంది. 17ఏండ్ల తర్వాత అక్షయ్, సైఫ్ అలీఖాన్ కలసి నటిస్తున్న ఈచిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిల్మ్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ కలిసి నిర్మిస్తున్నారు.
ఊటీ, ముంబైలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నది. ఈ సినిమాలో నటించడం ఎైగ్టెటింగ్గా ఉందని సోషల్ మీడియా ద్వారా అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ ఆనందం వ్యక్తం చేశారు.