ఏగన్, కోర్ట్ శ్రీదేవి, మిన్నల్ మురళి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న పానిండియా రొమాంటిక్ డ్రామా ‘హైకు’. యువరాజ్ చిన్నసామి దర్శకుడు. డా.అరుళనందు, మాథ్యో అరుళనందు నిర్మాతలు. నిర్మాతల్లో ఒకరైన డా.అరుళనందు పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇదొక రొమాంటిక్ డ్రామా అని ఈ పోస్టర్ని చూస్తే తెలుస్తున్నది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న ఓ గ్యాలరీలో కూర్చున్న హీరోహీరోయిన్లని ఈ పోస్టర్లో చూడొచ్చు.
యువతీయువకుల్లోని అమాయకత్వం, ప్రేమ, విద్యార్థి జీవితంలో వారు కనే కలలు.. వీటన్నింటి మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పోస్టర్లో కనిపిస్తున్న లవ్‌సింబల్ హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి అద్దం పడుతున్నది. త్వరలో విడుదల కానున్న ఈ పానిండియా చిత్రానికి కెమెరా: ప్రియేష్ గురుసామి, సంగీతం: విజయ్ బుల్గానిన్, కథనం: హరిహరన్ రామ్, యువరాజ్ చిన్నసామి, నిర్మాణం: విజన్ సినిమా హౌస్.