ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు సూపర్‌స్టార్. ఇటీవలే ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో ‘కూలీ’ పూర్తి చేశారు. ప్రస్తుతం ‘జైలర్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యేలోపే కొత్త చిత్రానికి రంగం సిద్ధ చేసే పనిలో ఉన్నారు తలైవా. తాజా సమాచారం ప్రకారం హెచ్.వినోద్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమాకు అంగీకరించారని తెలిసింది.
ప్రస్తుతం ఈ దర్శకుడు దళపతి విజయ్‌తో ‘జననాయగన్’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తయ్యాక రజనీకాంత్‌తో ఆయన సినిమా ఉంటుందట. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లేనని చెన్నై సినీ వర్గాల టాక్. అదే సమయంలో ధనుష్‌తో కూడా హెచ్.వినోద్ ఓ సినిమా ప్రయత్నాల్లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. మరి ఇద్దరు స్టార్స్‌లో ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందంటున్నారు.