GV Prakash Kumar | నేను ధనుష్ ఆరేళ్ళు మాట్లాడుకోలేదు : జి. వి. ప్రకాష్
GV Prakash Kumar | తమిళ సంగీత దర్శకుడు జి. వి.ప్రకాశ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
GV Prakash Kumar | తమిళ సంగీత దర్శకుడు జి. వి.ప్రకాశ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యుగానికి ఒక్కడు, ఆడుకాలం, ‘మయక్కం ఎన్నా’, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, సార్, కెప్టెన్ మిల్లర్ సినిమాలకు సంగీతం అందించి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గోన్న జీ.వి.. తమిళ నటుడు ధనుష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తమిళ నటుడు ధనుష్, జి. వి.ప్రకాశ్‌లు ఒకప్పుడు మంచి స్నేహితులు. వీరి కాంబోలో ఇప్పటివరకు ‘మయక్కం ఎన్నా’, ఆడుకాలమ్, సార్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు వచ్చాయి. అయితే ఆడుకాలమ్ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్ని రోజులుగా మాట్లాడుకోలేదు. ఇదే విషయాన్ని ధనుష్‌తో పాటు జీవీని అడిగిన స్పందించేవారు కాదు. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ వివాదంపై జీ.వి.ప్రకాశ్ నోరువిప్పాడు. నాకు ధనుష్‌కు గొడవ జరిగిందన్న వార్త నిజమే.. ఫ్రెండ్స్ అన్నప్పుడు గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నాం. రీసెంట్గా ధనుష్‌తో రెండు సినిమాలు కూడా చేశాను అంటూ జి. వి. వెల్లడించాడు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ధనుష్ కుబేరా చిత్రంలో నటిస్తుండగా.. జి.వి.ప్రకాశ్ ‘డియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

