యథార్థ సంఘటల ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా ‘గుర్తింపు’. కేజేఆర్ కథానాయకుడు. తెన్‌పతియాన్ దర్శకుడు. స్వస్తిక్ విజన్స్ సమర్పణలో గంగా ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్నది. 85శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మహేశ్వర్‌రెడ్డి మూలి మాట్లాడుతూ ‘పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి..
తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, గుర్తింపు కోసం చేసిన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు నేపథ్యంతో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘గుర్తింపు’. నిర్మాతగా మేం అనువదించిన శివకార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’ మంచి విజయాన్ని సాధించింది. డైరెక్ట్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం.’ అని తెలిపారు.