Guntur kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ గుంటూరు కారం (Guntur kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28)గా తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్‌తోపాటు సెకండ్ సింగిల్ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. కాగా ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ ఎప్పుడనే దానిపై ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం గుంటూరు కారం థ్రియాట్రికల్ ట్రైలర్‌ను 2024 జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాంఛ్ చేయబోతున్నారన్న వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గుంటూరు కారంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించనుంది. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్నారు.
గుంటూరు కారం చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తున్నాడు. గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్.. సూపర్ స్టార్ నుంచి అభిమానులు కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్..
దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్..
మహేశ్‌బాబు స్పెషల్ బర్త్‌డే విషెస్..
Wishing our talented director #TrivikramSrinivas a blockbuster birthday and a spectacular year ahead !! 🤗❤️ pic.twitter.com/QbJsWrQqIE
— Mahesh Babu (@urstrulyMahesh) November 7, 2023
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..