Guntur Kaaram | మహేశ్‌బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. విడుదల తేదీకి ఇంకా రెండు రోజులే ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ సంబంధించి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
‘గుంటూరు కారం’ అడ్వాన్స్ బుకింగ్స్ (Guntur kaaram Movie Advance Bookings) ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యినట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎగబడుతుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తాయని చిత్రబృందం ధీమాగా ఉంది. https://in.bookmyshow.com లింక్ ద్వారా ఈ మూవీ టికెట్లను బుక్ చేసుకోవచ్చని చిత్రబృందం తెలిపింది.
రమణ గాడి MASS జాతర చూడటానికి Ready అయిపోండి! 🔥💥 #GunturKaaram Advance Bookings are OPEN Now! 🕺😎
Grab your tickets now 🎟️ – https://t.co/mQOHYMf01I
Super 🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash… pic.twitter.com/2CL4cW1dpI
— BA Raju’s Team (@baraju_SuperHit) January 10, 2024
మరోవైపు ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. సింగిల్ స్క్రీన్స్‌లో 65 రూపాయలు, మల్లీఫ్లెక్స్‌లలో 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి రాష్ట్రంలోని 23చోట్ల బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఇచ్చింది. వీటితో పాటు ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.