Guns And Roses | పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ పవర్ ఫుల్ రెస్పాన్స్ రాబట్టగా, ‘సువ్వి సువ్వి’ పాట కూడా అలరించింది. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీపై హైప్ పెంచే పనిలో పడిపోయారు. సినిమా ట్రైలర్ పై డైరెక్టర్ సుజీత్ పూర్తిగా ఫోకస్ పెట్టారని సినీ వర్గాల టాక్.. సెప్టెంబర్ 18న ట్రైలర్ విడుదల చేస్తారని టాక్.ఇక ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుండి గన్స్ అండ్ ఫైర్ అంటూ సాగే పాట విడుదల చేశారు. ఈ పాట ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది. ఈ పాట మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
ఇక మరి కొద్ది రోజులలో విడుదల కానున్న ట్రైలర్లో పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, తమన్ ఇచ్చిన పవర్ ఫుల్ బీజీఎం రికార్డులు చెరిపేస్తాయని అంటున్నారు. ఇక సెప్టెంబర్ 19న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి, 20న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అమెరికాలో ఇప్పటికే OG అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాగా, టికెట్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కి ఉన్న పాన్-ఇండియా ఫాలోయింగ్ సినిమాకి క్రేజును రెట్టింపు చేస్తోంది. రిలీజింగ్ డే రోజున భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాలో, ప్రియాంక మోహన్ హీరోయిన్గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, హరిష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన మాస్ మ్యూజిక్‌తో రెచ్చిపోనున్నాడు.గత కొద్ది రోజులుగా ఓజీకి సంబంధించిన పోస్టర్స్ కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇవి ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.