బ్యూటీఫుల్ హీరోయిన్ మేఘా ఆకాశ్.. యంగ్ హీరో అరుణ్ అదిత్ ప్రధాన పాత్రధారులుగా సుశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం డియర్ మేఘ. అర్జున్ సోమయాజులు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాల స్పీడ్ పెంచారు.
వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న ”డియర్ మేఘ” చిత్రం నుండి ‘గుండెల్లో కన్నీటి మేఘం..’ అనే లిరికల్ సాంగ్ ను హీరోయిన్ హెబా పటేల్ శనివారం విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగే ఈ పాట మనసును మెలిపెడుతుంది. గుండెల్లో కన్నీటి మేఘం..కమ్మిందా తానైతే దూరం…అడిగే లోపే, అతడే లేడే, మాటేమో నలిగింద పెదవుల వెనకే, మౌనం, లోనె…గుండెల్లో కన్నీటి మేఘం..కమ్మిందా తానైతే దూరం…గతమే పోదే, మరుపే రాడే, గుర్తొస్తె తన శ్వాస మనసును కోసే…గాయం, చెసె…గుండెల్లో కన్నీటి మేఘం..కమ్మిందా తానైతే దూరం*…అంటూ సాగే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ పాటకు హరి గౌర సంగీతాన్ని అందిచంగా, హరిణి పాట పాడింది. గత రచయిత కృష్ణకాంత్ పాటను రాసారు. మేఘ ఆకాశ్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. సినిమా ప్రతి ఒక్కరిని అలరించేలా ఉంటుందని, సినిమా చూసిన వారు హ్యాపీగా థియేటర్ నుండి బయటకు వస్తారని అంటున్నారు మేకర్స్.