సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణని చిత్రసీమకు పరిచయం చేస్తూ అజయ్‌భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రవీనా టాండన్ కుమార్తె రషా తడాని కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని పి.కిరణ్ నిర్మిస్తున్నారు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలు పెంచాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ సినిమాలోని మూడో పాటకు చెందిన అప్డేట్ని మేకర్స్ అందించారు.
‘గుండె పేలిపోతోందే..’ అంటూ సాగే ఈ పాటను ఈ నెల 16న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓ అనౌన్స్మెంట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. దేవాలయం నేపథ్యంలో కనిపిస్తున్న హీరోహీరోయిన్లను ఈ పోస్టర్లో చూడొచ్చు. వారి ప్రేమలోని భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ, ఫీల్‌గుడ్ వైబ్‌ని ఈ పోస్టర్ క్రియేట్ చేస్తున్నది. ప్రఖ్యాత నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ISC, సంగీతం: జీవి ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: చందమామ కథలు.