Gudumba Shankar | సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పవన్ కల్యాణ్ పుట్టినరోజు జరిపేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ కెరీర్లో స్పెషల్ సినిమాగా నిలిచిన గుడుంబా శంకర్ (Gudumba Shankar)ను రీరిలీజ్ చేస్తున్నారని తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 31 న రీరిలీజ్ కాబోతుందని ఇప్పటికే నిర్మాత నాగబాబు వెల్లడించారు.తాజా అప్డేట్ ప్రకారం సెప్టెంబర్ 2 వరకు స్పెషల్ షోలు ఉండబోతున్నాయి. ఈ సందర్భంగా హీరోయిన్ మీరాజాస్మిన్ (Meera Jasmine) తన ఎక్జయిట్‌మెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.
‘అందరికీ నమస్కారం.. మన పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా గుడుంబా శంకర్ మూవీ రీరిలీజ్ చేస్తున్నారు. గుడుంబా శంకర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. పవన్ కల్యాణ్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం. కామెడీ, సాంగ్స్ షూట్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. చాలా సంతృప్తిగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్లీ అంతే ప్రేమను అందిస్తున్నారు. 20 ఏండ్లు అవుతుందంటే ఇది నిజంగా నమ్మశక్యంగా అనిపించడం లేదు. అభిమానులందరికీ ధన్యవాదాలు.
ఆగస్టు 31న నిర్మాత నాగబాబు, డైరెక్టర్ వీరశంకర్, చిత్రయూనిట్ అందరికీ మంచి విజయాన్ని అందించాలని ఆశిస్తున్నా. పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ’ మీరాజాస్మిన్ షేర్ చేసిన వీడియో ఇప్పుడునెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రీసెంట్గా జల్సా, ఆరెంజ్ రీరిలీజ్‌కు వచ్చిన కలెక్షన్లను జనసేనకు విరాళంగా అందించిన విషయం తెలిసిందే. గుడుంబా శంకర్ రీరిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా జనసేన పార్టీకి విరాళంగా అందించనున్నట్టు సమాచారం.
మీరాజాస్మిన్ కామెంట్స్ ఇలా..
Actress #MeeraJasmine about #GudumbaShankar re release ..!pic.twitter.com/BW8mQ86yXV
— Pawanism Network (@PawanismNetwork) August 30, 2023