విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకుడు. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. ఓ హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలైన టీజర్ డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌ను పరిచయం చేస్తూ ఆసక్తికరంగా సాగింది.
విష్ణు విశాల్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారు. ‘రాట్ససన్’ తర్వాత విష్ణువిశాల్ మరోసారి ‘ఆర్యన్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఓ హత్య కేసు పరిశోధన నేపథ్యంలో నడిచే ఇంటెన్స్ థ్రిల్లర్ ఇదని చిత్రబృందం పేర్కొంది. సెల్వరాఘవన్, శ్రద్ధాశ్రీనాథ్, మానస చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్, దర్శకత్వం: ప్రవీణ్ కె.